తమన్ ఇంటర్వ్యూ

Monday,April 02,2018 - 05:16 by Z_CLU

ఈ నెల 5 న రిలీజవుతుంది నితిన్ ఛల్ మోహన రంగ. ఇప్పటికే ఈ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ తమన్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు అవి మీ కోసం…

స్పెషల్ సెల్ఫీ…

పవన్ కళ్యాణ్ గారితో ఇంతకు ముందు చాలా ఫోటోస్ దిగాను కానీ, సెల్ఫీ దిగలేదు. ‘ఛల్ మోహన రంగ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవర్ స్టార్ తో ఫస్ట్ సెల్ఫీ… డెఫ్ఫినేట్ గా స్పెషల్ సెల్ఫీ…

ఫ్యాన్ మూమెంట్…

నాకు 7, 8 ఏళ్ల వయసున్నప్పుడు రజనీకాంత్ గారితో ఫోటో దిగాను. అది నా లైఫ్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్…

 

నేను ట్వీట్ చేసేది చాలా తక్కువే…

నేను ట్విట్టర్ లో అంత ఆక్టివ్ గా ఉండను. కాకపోతే నా ఆల్బమ్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు డెఫ్ఫినేట్ గా ప్రమోట్ చేసుకుంటాను. అప్పుడు ఆ టైమ్ లో ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటాను. ఒక ట్వీట్ మీన్స్ ఒక ప్రెస్ మీట్ లాంటిది.

పెద్దపులి సాంగ్…

పెద్దపులి సాంగ్ నిజంగా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ సాంగ్ ని అన్ని సాంగ్స్ అయిపోయిన తరవాత కంపోజ్ చేశాను. ఏదైనా కొత్తది ట్రై చేయడం అంత కష్టం కాదేమో కానీ, అంత సూపర్ హిట్ సాంగ్ ని రీకంపోజ్ చేయడం అనేదే పెద్ద చాలెంజ్. కానీ లాస్ట్ కి సినిమాలో చూస్తుంటే హ్యాప్పీ…

విజన్ ఫస్ట్…

ఏ సాంగ్ కంపోజ్ చేసినా ముందు నేను ఆ సాంగ్ ని ఇమాజిన్ చేసుకుంటాను. సిచ్యువేషన్ ని బట్టి స్ట్రీట్ లో, ఐస్ లో… ఇంకేదైనా లొకేషన్ ఫస్ట్ నేను ఊహించుకుని దానికి తగ్గట్టుగా సాంగ్స్ ని కంపోజ్ చేసుకుంటాను…

 

ప్రతి ఆర్టిస్ట్ లో ఉంటుంది…

ప్రతి ఆర్టిస్ట్ లో మ్యూజికల్ టెంపో ఉంటుంది. అది ఉంటే చాలు ఎవరైనా పాడేస్తారు. అక్కడక్కడా శృతి తప్పినా టెక్నాలజీ చాలా డెవెలప్ అయింది కాబట్టి మ్యానేజ్ చేసేయొచ్చు… NTR, రవితేజ లాంటి స్టార్స్ కి కూడా ఇంటర్నల్ గా ట్యాలెంట్ ఉంది కాబట్టే, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కి మ్యానరిజం కి సూటయ్యే సాంగ్స్ ఇచ్చి పాడించాను…

సినిమాలో మేఘా… సాంగ్…

కంప్లీట్ గా డైరెక్టర్ డెసిషనే. ఈ సాంగ్ ని మేఘా కజిన్ రాహుల్ నంబియార్ చాలా బాగా పాడాడు.

చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ…

ఓ వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు త్రివిక్రమ్.. నితిన్ కి 25 వ సినిమా… డైరెక్టర్ కృష్ణ చైతన్య… అన్ని కలిసి చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాను. ఇంత పెద్ద పేర్లు వాటి మధ్య నేను… చాలా బాధ్యతగా చేశానీ సినిమాని…

సినిమాలో అదే హైలెట్…

ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. నాకు సినిమాలో అన్నింటి కంటే అది చాలా బాగా నచ్చింది…

 

కష్టమే కానీ…

మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. డెఫ్ఫినేట్ గా మేం చేసేది టఫ్ఫెస్ట్ జాబ్. చాలా ఫార్వార్డ్ గా ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తాం.

అమ్మంటే అంతే…

ఎంత బిజీగా ఉన్నా అమ్మతో మాట్లాడుతూనే ఉంటా.. నేను ఐ ఫోన్ కొంటే తనకు కూడా ఐ ఫోన్ కొంటాను… ప్రతి టెక్నాలజీ ని అప్డేట్ చేస్తుంటాను. నాకు తెలిసి మనం అమ్మకు చేయగలిగింది కూడా ఏమీ లేదు. మనకు లక్ష గోల్స్ ఉంటాయి కానీ వాళ్లకు ఒకటే గోల్.. మా వాడు బావుండాలి.. మన అమ్మాయి బావుండాలి.. అందుకే అమ్మ చాలా స్పెషల్…

వెరీ వెరీ స్యాడ్ సాంగ్…

ఈ సాంగ్ లో లిరిక్ ఒకటే వెరీ వెరీ స్యాడ్. ట్యూన్ మాత్రం వెరీ హ్యాప్పీ ట్యూన్… నేనెప్పుడైనా లవ్ ఫీల్ లో ఉన్నప్పుడు ఆ సాంగ్ వింటాను….

పాప్యులర్ సింగర్ ‘ఎకాన్’ రెస్పాన్స్…

వాళ్లకు అసలీ టైప్ టెంపో తెలీదు. ఆ సాంగ్ ఫస్ట్ టైమ్ విన్నప్పుడు చిన్నపిల్లాడిలా అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తరవాత సెకండ్ టైమ్ చాలా ఎంజాయ్ చేశాడు.

 

ట్రెండీ గా ఉంటాయి అందుకే…

కొంచెం యూత్ కి ఎక్కువగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక్కో సాంగ్ లో ఇంగ్లీష్, హిందీ లిరిక్స్ వాడుతుంటా… వెరీ వెరీ స్యాడ్ సాంగ్ లో కూడా అంతే.. కొంచెం ఇంగ్లీష్ ఉంటుంది. తరవాత కంప్లీట్ సాంగ్ లిరిక్స్ చాలా బావుంటాయి.

ఛల్ మోహన రంగ సినిమా…  

సినిమాలో చాలా ఫన్ ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమాని థియేటర్ లో చూడండి…