Vakeelsaab - తమన్ బెస్ట్ వర్క్
Saturday,April 10,2021 - 02:29 by Z_CLU
ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే అందులో టెక్నీషియన్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సక్సెస్ లో అలాంటి కీలక పాత్ర పోషించాడు తమన్. అవును.. ‘వకీల్ సాబ్’ షూటింగ్ స్టేజిలో ఉండగానే “మగువా మగువా” సాంగ్ తో హైప్ క్రియేట్ చేసి సినిమాకి బెస్ట్ సాంగ్ అందించాడు. ఆ తర్వాత కూడా అవే స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తూ మంచి క్వాలిటీతో అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేశాడు. “సత్యమేవ జయతే” , “కదులు కదులు” పాటలతో పాటు “కంటి పాప” అనే లవ్ సాంగ్ కూడా ఆల్బంలో బెస్ట్ అనిపించుకుంది.
ఇలా సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసిన తమన్ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి తన వర్క్ తో ‘వకీల్ సాబ్’ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.
సినిమా చూసిన ఆడియన్స్ తమన్ బెస్ట్ వర్క్ అంటూ కితాబిస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఎంట్రీ సీన్, ఇంటర్వల్ బ్యాంగ్ తో పాటు మెట్రో ట్రైన్ ఫైట్ తర్వాత సన్నివేశాలకు రోమాలు నిక్కబొడిచే రేంజ్ BGM అందించాడు. వీటికి ఓ రేంజ్ లో స్కోర్ ఇచ్చి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
అందుకే సినిమా చూసిన ప్రేక్షకులు… పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ , కోర్ట్ సీన్స్ తర్వాత తమన్ మ్యూజిక్ గురించే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అంతలా తన మ్యూజిక్ టాలెంట్ తో మెస్మరైజ్ చేశాడు తమన్.
మొదటి సారి పవన్ కళ్యాణ్ సినిమాకు వర్క్ చేసే అవకాశం దొరకడంతో దాన్ని సద్వినియోగం చేసుకొని బెస్ట్ వర్క్ ఇచ్చాడు తమన్. దర్శక, నిర్మాతలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాటలతోనే నిరుపించుకున్న తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు మరింత బలాన్ని అందించి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు.
వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ డెలివరీ చేస్తూ మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకుంటున్న తమన్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics