'V' కోసం తమన్ !

Thursday,February 13,2020 - 04:11 by Z_CLU

నాని , సుదీర్ బాబులతో ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ‘V’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే నాని , సుదీర్ బాబుల లుక్స్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం ఇస్తున్నాడు. ఇటివలే టీజర్ కి సంబంధించిన మ్యూజిక్ వర్క్ కూడా పూర్తి చేసాడు.

ఈ నెల 17 న టీజర్ రిలీజ్ చేస్తున్నారు. నాని , సుదీర్ బాబు ల సన్నివేశాలతో కొన్ని ఆసక్తికరమైన షాట్స్ తో టీజర్ ను కట్ చేశారు. టీజర్ కి తమన్ మ్యూజిక్ మేజర్ హైలైట్ అంటున్నారు. ఇప్పటికే నేపథ్య సంగీతంలో బెస్ట్ అనే బిరుదు తెచ్చుకున్నాడు తమన్. అందుకే ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడుకుంటున్నారు.

ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ 25న థియేటర్స్ లోకి రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , శిరీష్ , హర్షిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.