‘సాహో’ అనిపించుకుంటున్న తమన్

Tuesday,October 23,2018 - 07:03 by Z_CLU

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘సాహో’ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ వీడియో రెగ్యులర్ సినిమాల మేకింగ్ వీడియోలా కాకుండా ఆల్మోస్ట్ టీజర్ ఎఫెక్ట్ ని ఇచ్చింది. అందుకే ఆ వీడియోకి ఆ రేంజ్ గ్రాండియర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ‘సాహో’ అంటున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాకోసం అబూదాబి  లో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ అధ్వర్యంలో తెరకెక్కిన, రియల్ యాక్షన్ సీక్వెన్సెస్ ని చాప్టర్ 1 గా రిలీజ్ చేసింది సాహో టీమ్. ‘షేడ్స్ ఆఫ్ సాహో’ పేరుతో జస్ట్ 1:22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.  దానికి  తమన్ కొట్టిన స్కోర్ రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అనేంతలా మెస్మరైజ్ చేస్తుంది.

గతంలో మెగాస్టార్ ‘సైరా’ మోషన్ పోస్టర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు తమన్. ఇప్పుడీ ‘సాహో’ కి కూడా BGM ఇచ్చి పాస్ మార్కులు కొట్టేశాడు, అటు వరస విజయాలతో ఫామ్ లో ఉన్న తమన్ అకౌంట్ లో బోనస్ గా ఆడ్ అయింది ప్రభాస్ సాహో.

సుజిత్ డైరెక్షన్ లో UV క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది సాహో. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.