DJ Tillu సంక్రాంతి సినిమాకి తమన్ సపోర్ట్

Thursday,January 06,2022 - 04:18 by Z_CLU

లాస్ట్ మినట్ లో సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయాలని తమన్ ని అప్రోచ్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.  ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కి కూడా తమన్ స్కోర్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మరో చిన్న సినిమాకు కూడా తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సపోర్ట్ అందిస్తున్నాడు. సిద్దు హీరోగా సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ‘DJ టిల్లు’ రిలీజ్ కి రెడీ అయింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.

అయితే ఈ సినిమాకు లాస్ట్ మూమెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా యాడ్ అయ్యాడు మ్యూజిక్ సెన్సేషన్ తమన్. తాజాగా తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మేకర్స్. ఈ మధ్యే సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ లో తెరకెక్కిన ‘వరుడు కావలెను’ సినిమాకు రెండు పాటలు కంపోజ్ చేసిచ్చాడు తమన్. తన హోం బేనర్ లా ఫీలయ్యే సితార కోసం బిజీగా ఉన్నప్పటికీ టైం ఎడ్జస్ట్ చేసుకొని వర్క్ చేసి పెడుతున్నాడు.

ప్రస్తుతం బడా సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ బ్యాక్ స్కోర్ అనగానే అందరూ తమన్ వైపే చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడు తమన్. మరి సంక్రాంతి బరిలో నిలిచిన ‘డీజే టిల్లు’ సినిమాకు తమన్ స్కోర్ ఎంతవరకూ ప్లస్ అవుతుందో వేచి చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics