సైరా టెస్ట్ కట్.. డిసెంబర్ 6 నుంచి షూటింగ్

Thursday,November 16,2017 - 12:01 by Z_CLU

స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఎప్పుడూ టెస్ట్ కట్ చేయించుకోలేదు చిరంజీవి. సెట్స్ పైకి డైరక్ట్ గా వెళ్లిపోవడమే తెలుసు. కానీ ఫస్ట్ టైం రిహార్సల్స్ చేశారు మెగాస్టార్. సైరా నరసింహారెడ్డి సినిమా కోసం 2 రోజుల పాటు చిరంజీవిపై టెస్ షూట్ నిర్వహించారు. అవుట్ పుట్ చూసి తన గెటప్, లుక్ పై పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు చిరంజీవి. దీంతో సైరా రెగ్యులర్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.

ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా మేకోవర్ అవుతున్నారు చిరు. ఫుల్ గా గడ్డం పెంచడంతో పాటు మీసకట్టు కూడా మార్చారు. అలా రెడీ అయిన గెటప్ తో 2 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు చిరు. బిగ్ స్క్రీన్ పై తన గెటప్ చూసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ లాంటి సన్నిహితుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంతా ఓకే అనడంతో సైరా లో గెటప్ లాక్ చేశారు.

డిసెంబర్ 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లోనే షూటింగ్ ఉంటుంది. తర్వాత షెడ్యూల్స్ కోసం రాజస్థాన్, గుజరాత్ కు షిఫ్ట్ అవుతుంది యూనిట్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు బాణీలు అందించబోతున్నాడు.