ఆచార్య కోసం ఆలయం సెట్

Tuesday,July 21,2020 - 01:28 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కోకాపేటలో ఓ భారీ సెట్ వేశారు. లాక్ డౌన్ కు ముందు ఆ సెట్ లోనే షూటింగ్ జరిగింది. ఇప్పుడు మరో సెట్ నిర్మాణం జరుగుతోంది.

ఆచార్య కోసం రామోజీఫిలింసిటీలో పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారు. సెట్ వర్క్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగిగా కనిపిస్తారనే ప్రచారం మొదట్నుంచి ఉంది. ఆ పుకార్లకు మరింత ఊతమిచ్చేలా ఇప్పుడు టెంపుల్ సెట్ వేస్తున్నారు.

కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ల పై వస్తున్న ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ, 5 అద్భుతమైన పాటలు కంపోజ్ చేశాడు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆచార్యను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.