తెలుగు సినిమా మిలిటరీ హీరోలు

Saturday,May 18,2019 - 12:03 by Z_CLU

అటు దేశభక్తి… ఇటు పవర్ యాక్షన్ ఎలిమెంట్స్… రెండింటినీ ఒకేసారి ప్రెజెంట్ చేయాలంటే అది మిలిటరీ బ్యాక్ డ్రాప్ అయితేనే పక్కాగా ఎలివేట్ అవుతుంది. అందుకే మన స్టార్ హీరోలు ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాల్సి వస్తే, అంత ఈజీగా ఆ ఆఫర్ ని వదులుకోరు… ఇప్పటికే కొంతమంది స్టార్స్ ఈ జోనర్ లో తన సత్తా చూపించారు…

నాగచైతన్య : ‘వెంకీమామ’ లో మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఎగ్జాక్ట్ గా ఈ రోల్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ రివీల్ కాలేదు కానీ, క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

అల్లు అర్జున్ : ‘నా పేరు సూర్య’ లో కనిపించాడు అల్లు అర్జున్ పవర్ ఫుల్ మిలిటరీ ఆఫీసర్ లా… ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ చేసుకున్నాడు బన్ని. లుక్స్ దగ్గరి నుండి బాడీ బిల్డింగ్ వరకు ప్రతీది మిలిటరీ ఆఫీసర్ స్టైల్ లో ప్రెజెంట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ : ‘జవాన్’ సినిమాలో CRPF జవాన్ లా నటించాడు. ఈ బ్యాక్ డ్రాప్ లో డిఫెరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కిందీ సినిమా.

వరుణ్ తేజ్ : ‘కంచె’ సినిమాలో బ్రిటీష్ కాలం నాటి మిలిటరీ ఆఫీసర్ లా కనిపించాడు వరుణ్ తేజ్. ఈ సినిమా వరుణ్ తేజ్ కరియర్ లోనే స్పెషల్ గా నిలిచింది.

అల్లు శిరీష్ – 1971 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బియాండ్ బార్డర్స్’ లో కీ రోల్ ప్లే చేశాడు అల్లు శిరీష్. ఓ వైపు యూత్ ఫుల్ సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న ఈ మెగాహీరో ఈ సినిమాతో మళయాళ సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు.

అంతేకాదు.. హను రాఘవపూడి దర్శకత్వంలో నాని చేయాల్సిన సినిమాలో కూడా నేచురల్ స్టార్ ది మిలట్రీ ఆఫీసర్ క్యారెక్టరే.