ఈషా రెబ్బ రేంజ్ మారిపోయింది

Tuesday,January 21,2020 - 10:03 by Z_CLU

ఈషా రెబ్బ… అంతకు ముందు ఆ తరవాత సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ సినిమాలే. కథల్ని ఎంచుకోవడంలో ఈషా గురించి ప్రత్యేకంగా చేపుకోవాలి. కానీ ఏం లాభం..? పరిచయమై ఇన్నేళ్ళయినా ఈషా స్టార్ హీరియిన్ లిస్టుకి మాత్రం ఇంకా ఆమడ దూరంలో ఉంది. ఇదీ.. నిన్నా మొన్నటి వరకు ఈషా రెబ్బ స్టేటస్.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఈషా బాలీవుడ్ హీరోయిన్ మరీ…

బాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈషా రెబ్బ. అనీల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో రాజస్థానీ అమ్మాయిగా కనిపించనుంది ఈషా రెబ్బ. రీసెంట్ గా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆడిషన్ కి వెళ్ళిన ఈషా రెబ్బ, ఫిలిమ్ మేకర్స్ ని ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది.

రాజ్ సింగ్ చౌహాన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా సక్సెస్ అయితే ఈషా రేంజ్ ఆల్మోస్ట్ మారిపోతుంది.