పర్మిషన్ గ్రాంటెడ్.. సైరా హంగామా షురూ

Tuesday,October 01,2019 - 05:45 by Z_CLU

సైరా హంగామా అఫీషియల్ గా షురూ అయింది. ఈ సినిమా అదనపు ప్రదర్శనలకు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. తెలంగాణలో అదనంగా మరో షో వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రోజుకు 6 షోలు వరకు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా అనుమతులతో ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 3 గంటల 45 నిమిషాలకే మొదటి షో పడబోతోంది. వైజాగ్, విజయవాడ, తిరుపతిలో దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచే షోలు మొదలు కాబోతున్నాయి. అంటే.. ఫస్ట్ టాక్ ఉదయం 7 గంటలకే బయటకు వచ్చేస్తుందన్నమాట.

ఇక తెలంగాణలో కూడా అదనపు ప్రదర్శనలకు అనుమతి రావడంతో సెలక్టెడ్ థియేటర్లలో పొద్దున్నే షోలు పడబోతున్నాయి. హైదరాబాద్ లో కొన్ని థియేటర్లలో ఉదయం 7 గంటలకే షో స్టార్ట్ అవుతోంది. అదనపు షోలతో కలుపుకొని, ఒక్క హైదరాబాద్ లోనే రేపు 500కు పైగా షోలు పడబోతున్నాయి.

ఇక ముంబయిలో సైరా సినిమాను మరికొద్దిసేపట్లో ప్రదర్శించబోతున్నారు. అవును.. సైరా హిందీ వెర్షన్ ను బాలీవుడ్ మీడియాకు ఈరోజు రాత్రే చూపించబోతున్నారు. అటు ఓవర్సీస్ లో సైరా హైప్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో నడుస్తోంది సైరా హంగామా.