వెంకీ సరసన తేజస్వికి ఛాన్స్...?

Saturday,October 29,2016 - 03:35 by Z_CLU

ఇప్పటివరకు కుర్రహీరోలు, ఓ మోస్తరు నటీనటులతో మాత్రమే నటించిన తేజస్వి… ఇప్పుడు బిగ్ ఆఫర్ అందుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే వెంకీ సరసన మెరవనుంది ఈ ఐస్ క్రీం భామ. కేరింత, రోజులు మారాయి లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన తేజస్వి… వెంకీ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందట.

     ప్రస్తుతం గురు అనే సినిమా చేస్తున్న వెంకీ… ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తాడు. ఈ సినిమాకు ఆడాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే నిత్యామీనన్ ను సెలక్ట్ చేయగా… సెకెండ్ హీరోయిన్ గా తేజస్విని తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా అనసూయ పేరును కూడా పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకురానున్నాయి.