తేజ ఖాతాలో 2 పెద్ద సినిమాలు

Thursday,October 12,2017 - 09:01 by Z_CLU

నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయని దర్శకుడు తేజ.. త్వరలోనే రెండు భారీ సినిమాల్ని హ్యాండిల్ చేయబోతున్నాడు. వీటిలో ఒకటి తాజాగా కన్ ఫర్మ్ అయింది. మరోటి ఆల్ మోస్ట్ కన్ ఫర్మ్ అయ్యే స్టేజ్ లో ఉంది.

తేజ డైరక్ట్ చేయబోతున్న ఓ భారీ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. మొన్నటివరకు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లో వస్తుందనుకున్న ఈ బయోపిక్ ఇప్పుడు తేజ చేతికొచ్చింది. వారాహి చలనచిత్ర బ్యానర్ తో కలిసి సహ-నిర్మాతగా మారి ఈ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ త్వరలోనే స్టార్ట్ అవుతుందంటూ తేజ స్వయంగా ప్రకటించారు.

ఇక తేజ చేతిలో ఉన్న మరో బిగ్ ప్రాజెక్టు వెంకీ సినిమా. విక్టరీ వెంకటేష్-తేజ మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. వెంకీ కూడా సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వెంకీ ఓకే చెబితే ఫస్ట్ సెట్స్ పైకి వచ్చేది ఆ సినిమానే. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ-ప్రొడక్షన్ కు చాలా టైమ్ పడుతుంది.