కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్న తేజ ?

Wednesday,February 24,2021 - 01:48 by Z_CLU

టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు దర్శకులు తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు వేగేశ్న సతీష్ కూడా తనయుడు సమీర్ వేగేశ్న ను తన ‘కోతి కొమ్మచ్చి’ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో దర్శకుడు తేజ కొడుకు అమితవ్ తేజ కూడా చేరనున్నాడని తెలుస్తుంది. ఇటివలే చిత్రం తన మొదటి సినిమా ‘చిత్రం’ కి సీక్వెల్ గా  ‘చిత్రం 1.1’ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు తేజ. ఈ సినిమా ద్వారా 45 మంది కొత్త వాళ్ళను పరిచయం చేయబోతున్నాను అంటూ తెలిపాడు కూడా.

Chitram1point1-movie

తాజా సమాచారం ప్రకారం అందులో హీరోగా నటించేది తేజ కొడుకే అట. ఇప్పటికే న్యూ యార్క్ లో యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన అమితవ్ ను తన డైరెక్షన్ లో ఈ సినిమాతో లాంచ్ చేయాలని తేజ డిసైడ్ అయ్యాడని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.మరి టాలీవుడ్ లో ఎంతో మంది కొత్త నటీ నటులను  పరిచయం చేసిన తేజ తన కొడుకును ఈ సినిమాతో హీరోగా నిలబెడతాడా ? చూడాలి.