Teja Sajja ISHQ - రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,July 21,2021 - 08:03 by Z_CLU

Teja Sajja’s ISHQ movie To Release On July 30th

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌,ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

నిజానికి ఈ సినిమా చాన్నాళ్ల కిందటే విడుదల కావాల్సింది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆఖరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. అలా ఆగిపోయిన ఈ సినిమాను 30న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

తెలంగాణలో థియేటర్ల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ ఫీజు పెట్టుకోవచ్చు. అయితే మల్టీప్లెక్సులు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో మాత్రం పార్కింగ్ ఫీజు పెట్టకూడదు. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే ఈ అనుమతి. మిగతా అన్ని చోట్ల పాత పద్ధతే కొనసాగుతుంది. దీంతో ఈనెల 23 నుంచి థియేటర్లు తెరిచేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్లు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇష్క్ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

ISHQ movie teja sajja priya varrior 2

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌: మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics