Hanuman: హను-మాన్ మూవీ టీజర్ రెడీ

Monday,November 07,2022 - 01:32 by Z_CLU

Teja Sajja’s Hanu-Man Teaser to release on November 15th

‘జాంబీరెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) మరోసారి తనదైన స్టయిల్ లో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేయబోతున్నాడు.

`జాంబీరెడ్డి` సినిమాలో తన నటనతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) తో కలిసి ప్ర‌శాంత్ వ‌ర్మ‌ చేస్తోన్న ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’. (Hanu-Man Movie) ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత తేజా స‌జ్జ‌, ప్రశాంత్ వర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్ర‌మిది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది.

ఆమధ్య రిలీజైన ‘హను–మాన్‌’ ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అమృతా అయ్యర్ (Amritha Ayyar) ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నారు. నవంబర్ 15న టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

మన పురాణాలు ఇతిహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్‌హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అంతే కాకుండా `హనుమాన్` మ‌న భారతీయులకు సూపర్ హీరో.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది హను-మాన్ మూవీ. ఈ చిత్రం కోసం నలుగురు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.

HANU-MAN Teja Sajja