యంగ్ హీరో తో సెట్స్ పైకి వచ్చిన తేజ

Monday,July 09,2018 - 02:44 by Z_CLU

తేజ కొత్త సినిమా ఈ రోజే సెట్స్ పైకి వచ్చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించనున్న ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. మాసివ్ డైరెక్టర్ వి.వినాయక్ క్లాప్ కొట్టిన ఈ కార్యక్రమంలో మరో దర్శకుడు శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశాడు.

 ‘నేనే రాజు మంత్రి’ తరవాత తేజ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా రానుందని ఆ మధ్య కాస్త గట్టిగానే వినిపించినా,  ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఆ తరవాత NTR బయోపిక్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన తేజ, ఈ సినిమా నుండి కూడా తప్పుకోవడంతో, తేజ డైరక్షన్ లో సెట్స్ పైకి రానున్న సినిమాపై న్యాచురల్ గానే క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉంది.

 

ఈ లోపు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న తేజ, ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో సోను సూద్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్.