వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు!

Thursday,August 06,2020 - 02:29 by Z_CLU

ప్రస్తుతం OTT ఫ్లాట్ ఫార్మ్ కోసం వెబ్ సిరీస్ లు రెడీ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్స్. క్రిష్ లాంటి దర్శకులు ఇప్పటికే వెబ్ సిరీస్ లు నిర్మించగా తాజాగా తేజ కూడా ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడు.

తన దగ్గర పనిచేసే రాకేశ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తేజ ఓ సిరీస్ నిర్మిస్తున్నాడు. కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో నాలుగు రోజుల పాటు షూట్ కూడా చేశారు.

ఇంతలో తేజకి కరోనా సోకడంతో టీం బ్రేక్ తీసుకుంది. త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి వెళ్తారు. ఈ సిరీస్ కి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తుండటం మరో విశేషం. తొందర్లోనే షూట్ ఫినిష్ చేసి ఏదైనా OTT సంస్థకు హక్కులు అమ్మనున్నారు. అప్పటి వరకు వ్యవహారమంతా తేజ హోల్డ్ లోనే ఉంటుంది.