తేజ-గోపీచంద్ సినిమాకు డేట్ ఫిక్స్

Friday,July 31,2020 - 12:39 by Z_CLU

దర్శకుడు తేజ, హీరో గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు అలిమేలుమంగ వేంకటరమణ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.

ప్రస్తుతం గోపీచంద్ చేతిలో సీటీమార్ అనే సినిమా ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ సినిమాను ఆగస్ట్ – సెప్టెంబర్ లో పూర్తిచేసి డిసెంబర్ నుంచి తేజ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు ఈ మ్యాచో హీరో.

ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అనూప్ రూబెన్స్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించే ఛాన్స్ ఉంది.