తేజ్ I love u - ఫస్ట్ ఫీల్ రివ్యూ

Tuesday,May 01,2018 - 04:34 by Z_CLU

  కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ తేజ్ I love u.  ఈ రోజు ఫస్ట్ ఫీల్ పేరుతో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. కరుణాకరన్ మార్క్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ టీజర్,  యూత్ ని  ఇంప్రెస్ చేసిందనే అనిపిస్తుంది.

బస్ స్టాప్ లో నిలుచుని టీ తాగుతున్న తేజు, అప్పుడే పడుతున్న వర్షం.. అందులో తను ప్రేమించిన నందిని  గిటార్ వాయిస్తూ తన వంకే చూస్తుండటం, అది నిజమో కాదో తేల్చుకునే లోపే, అ అమ్మాయిని మరింత దగ్గరగా ఫీలవడం, తీరా చూస్తే, పీకల్లోతు లవ్ లో ఉన్న తేజుకి అది జస్ట్ భ్రమ అని క్లారిటీ రావడం… ఇది ఈ రోజు రిలీజైన టీజర్ లో ఉన్న పాయింట్స్. ఇక అసలు విషయానికొస్తే…

 

ఈ సినిమాపై బిగినింగ్ నుండే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.సాయి ధరమ్ తేజ్, అనుపమ కెమిస్ట్రీ పోస్టర్స్ రిలీజయినప్పుడే అదుర్స్ అనిపించుకున్నాయి. అయితే ఈ రోజు రిలీజైన టీజర్, టాలీవుడ్ లో రొమాంటిక్ సీజన్ ని బిగిన్ చేసిందా అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సినిమా ఎగ్జాక్ట్ స్టోరీ అయితే ప్రస్తుతానికి రివీల్ కాలేదు కానీ, ఈ టీజర్ రిలీజ్ తరవాత క్రియేట్ అయిన వైబ్స్ చూస్తుంటే సినిమా డెఫ్ఫినేట్ గా యూత్ ని ఇంప్రెస్ చేస్తుందనే అనిపిస్తుంది.

క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి K.S. రామారావు ప్రొడ్యూసర్. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజర్. ఈ నెలలో ఫ్యాన్స్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో 2 పాటల్ని తెరకెక్కించనున్న ఫిల్మ్  మేకర్స్ ఈ షెడ్యూల్ తో షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.