గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Sunday,November 11,2018 - 10:01 by Z_CLU

టాక్సీవాలా దూసుకొస్తున్నాడు. తన కారులో స్టయిలిష్ స్టార్ ను తీసుకొస్తున్నాడు. అవును.. ఈరోజు సాయంత్రం టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. హైదరాబాద్ jrc కన్వెన్షన్ హాల్ లో జరగనున్న ఈ వేడుకకు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు.

టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను జీ సినిమాలు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ లో ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ జీ సినిమాలు యూట్యూబ్, వెబ్ సైట్, ఫేస్ బుక్ పేజీల్లో కూడా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లైవ్ అందుబాటులో ఉంటుంది.

గతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతగోవిందం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు టాక్సీవాలా ప్రీ-రిలీజ్ కు కూడా బన్నీ వస్తుండడంతో.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే పాజిటివ్ సెంటిమెంట్ వినిపిస్తోంది.