రేపే 'టాక్సీ వాలా' ఆడియో రిలీజ్

Sunday,November 04,2018 - 11:02 by Z_CLU

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘టాక్సీ వాలా’ ఆడియో రేపే రిలీజ్ అవుతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సోషల్ మీడియా ద్వారా సాంగ్స్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. జేక్స్ బిజాయ్ కంపోజ్ చేసిన ఈ ఆల్బం రేపటి నుండి హంగామా చేయనుంది.  రీసెంట్ గా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘మాటే వినదుగ’ ప్రెజెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి ఫేవరేట్ గా మారిపోయింది.

విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘టాక్సీవాలా’ నవంబర్ 17న థియేటర్స్ లోకి రానుంది.