మరో లవ్ స్టోరీతో రీ-ఎంట్రీ

Wednesday,August 24,2016 - 07:08 by Z_CLU

 

ఇప్పుడు కుర్ర హీరోలంతా లవ్ స్టోరీస్ సినిమాలతో లవర్ బాయ్ అనే ఇమేజ్ అందుకుంటున్నారు కానీ అప్పట్లో లవర్ బాయ్ అంటే అది తరుణే. ‘నువ్వే కావాలి’, ‘ప్రియమైన నీకు’, ‘నువ్వే నువ్వే’ వంటి వరుస ప్రేమ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని కెరీర్ ఆరంభంలోనే లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న తరుణ్ కథానాయకుడిగా కొన్నేళ్ల గ్యాప్ తరువాత ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ మరో లవ్ స్టోరీ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ లవర్ బాయ్ ఇప్పుడు ఈ లవ్ స్టోరీ తో ఎలాంటి విజయం అందుకుంటాడో? చూడాలి.