తరుణ్ ఇంటర్వ్యూ

Monday,January 08,2018 - 03:51 by Z_CLU

లవర్ బాయ్ తరుణ్ ‘ఇది నా లవ్ స్టోరీ’ వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజవుతుంది. తరుణ్ సరసన ఒవియా హెలెన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రమేష్, గోపి డైరెక్షన్ లో తెరకెక్కింది. డిఫెరెంట్ లవ్ స్టోరీతో ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ ఉన్న తరుణ్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అందుకే ఫిబ్రవరి….

జనవరి రిలీజ్ చేసే చాన్స్ లేదు. పెద్ద సినిమాలున్నాయి కాబట్టి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కూడా మాగ్జిమం సినిమాలతో ప్యాక్డ్ అప్ ఉన్నాయి. అందుకే సినిమా టైటిల్ ‘ఇది నా లవ్ స్టోరీ’ కాబట్టి వ్యాలెంటైన్స్ డే రోజు రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాం.

 

నిజంగానే డిఫెరెంట్…

సినిమా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఈ ట్రైలర్ లో నేను 3 షేడ్స్ లో కనిపిస్తాను. అంటే నేను ఇందులో 3 క్యారెక్టర్స్ ప్లే చేశానా..? ట్రిపుల్ రోల్ ప్లే చేశానా..? అనేది సినిమా చూస్తే తెలిసిపోతుంది.

సినిమాకి అవే బ్యాక్ బోన్….

డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే. సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్. జస్ట్ టీజర్, ట్రైలర్ లో వినిపించే రెండు, మూడు డైలాగ్స్ కే మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు సాంగ్స్…

శ్రీనాథ్, విజయ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రస్తుతానికి 3 సాంగ్స్ రిలీజయ్యాయి. ప్రీరిలీజ్ ఫంక్షన్ రోజు తక్కిన 2 సాంగ్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం.