తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ

Thursday,June 28,2018 - 03:12 by Z_CLU

ఈ నెల 29 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘ఈ నగరానికి ఏమైంది..?’ సినిమా. ‘పెళ్లిచూపులు’ తరవాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియెన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మీడియాతో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అదే చేంజ్…

పెళ్ళి చూపులు రిలీజ్ టైమ్ లో ఉన్నంత టెన్షన్ ఇప్పుడు లేదు. పెళ్ళి చూపులతో కంపేర్ చేస్తే, ఈ సినిమాకి అప్డేటెడ్ టెక్నాలజీ వాడాం…  పెళ్లిచూపులు సక్సెస్ కి కథేబలం.. ఈ సినిమాకి కథతో పాటు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎసెట్…

అందుకే టైమ్ తీసుకున్నా…

పెళ్ళిచూపులు సక్సెస్ తరవాత చాలా ఆఫర్స్ వచ్చాయి. ఆ సక్సెస్ మూడ్ లోంచి బయటికి వచ్చాకే ఇంకో స్టోరీపై పని చేయాలనుకున్నా… అందుకే టైం తీసుకున్నా…. ఈ జర్నీలో నాకు అర్థమైందేంటంటే ప్రతి  సినిమాని ఫస్ట్ సినిమాలాగే చేయాలి… ఒక సినిమా సక్సెస్ తో కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ సినిమా విషయంలో డెసిషన్ తీసుకోకూడదు…

స్టార్స్ తో సినిమా అంటే రిస్కే…

నాకున్న ఎక్స్ పీరియన్స్ కి స్టార్స్ తో సినిమా అంటే రిస్కే… పెళ్లిచూపులు సక్సెస్ కి రీజన్ స్టోరీ… స్టార్స్ తో పని చేయాలంటే స్టోరీ రెడీ చేసుకునేటప్పుడే స్టార్స్ ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకుని రాసుకోవాలి. అలా నాకింకా ఎక్స్ పీరియన్స్ రాలేదు.. రాని పని చేయడం రిస్క్ కాబట్టే సెకండ్ మూవీని స్టార్స్ తో చేయలేదు…

అందుకే కొత్తవాళ్ళు…

‘ఈ నగరానికి ఏమైంది..?’ కంప్లీట్ గా ఫ్రెష్ స్టోరీ… ఇంకో కొత్త వరల్డ్ క్రియేట్ చేసి అందులో ట్రావెల్ చేయించాలి.. అలాంటప్పుడు తెలిసిన ఫేసెస్ అయితే కంపారిజన్స్ క్రియేట్ అవుతాయి.. అలా ఉండకూడదు, కంప్లీట్ గా కొత్త ఎక్స్ పీరియన్స్ ఉండాలి అనుకున్నాను కాబట్టే కొత్తవారిని పిక్ చేసుకున్నాను…

ఆ ఐడియాలజీ వదులుకోలేదు…

ఏ ఐడియాలజీ అయితే పెళ్ళి చూపులు సినిమాకు వాడానో, ఆ ఐడియాలజీ వదులుకోలేదు… ‘పెళ్ళిచూపులు’ సక్సెస్ తరవాత ఎవరెవరైతే పెద్దవాళ్ళు పెలిచి అప్రీషియేట్ చేశారో, ఆ రెస్పెక్ట్ ని ఫ్యూచర్ సినిమాలతో కూడా  కాపాడుకోవాలి. అందుకే ఎవరి ఐడియాలజీ తో కన్ఫ్యూజ్ కాకుండా నా పద్ధతిలోనే సినిమా తీశాను…

అందుకే ఈ టైటిల్…

‘ఈ నగరానికి ఏమైంది..?’ అనే టైటిల్ లోనే ఫన్ వైబ్ ఉంది. దానికి తోడు ఈ సినిమాలో 2 టాపిక్స్ ఉంటాయి.. ఒకటి ఫిల్మ్ మేకింగ్.. రెండోది ఆల్కహాల్… అందుకే ఈ టైటిల్ ఫిక్సయ్యాం..

నేను షాక్ లో ఉన్నా…

సురేష్ బాబు గారు బడ్జెట్ దగ్గరి నుండి సినిమా ఎడిటింగ్ వరకు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు.. నేను ఏది అడిగినా  నో అని చెప్పలేదు… నేనే షాక్ లో ఉన్నా…

విజయ్ దేవరకొండ…

సినిమాలో విజయ్ దేవరకొండ కామియో ఉంటుంది అని చెప్పలేను కానీ.. జస్ట్ సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడంతే…

సురేష్ ప్రొడక్షన్స్…

సురేష్  ప్రొడక్షన్స్  బ్యానర్ లో మొత్తం 3 సినిమాలకు సంతకం చేశాను కానీ, ఇప్పటి వరకు నెక్స్ట్ స్టోరీస్ విషయంలో ఇంకా ఆలోచన కూడా బిగిన్ చేయలేదు. స్టోరీ ఫిక్సయ్యాకే అందులో యాక్టర్స్ గురించి ఆలోచిస్తా…

నాకంత సీన్ లేదు…

ఫ్యూచర్ లో కూడా యాక్టర్ ని అయ్యే ఆలోచన లేదు. నేను మామూలుగానే సెట్స్ పై టెన్షన్ పడుతూ ఉంటా… సింగీతం  గారు కూడా అలాగే టెన్షన్ పడుతూ ఉంటారంట.. అందుకే న్యాచురల్ గా ఉంటుందని నాగ్ అశ్విన్ నన్ను పెట్టుకున్నాడు.. ఇక సమ్మోహనం విషయానికి వస్తే.. ఇంద్రగంటి గారు కాల్ చేశారు… నేను వెళ్లాను.. అంతే…

అంతకు మించి ఏం లేదు…

సమ్మోహనం స్టోరీ రాయడానికి ‘పెళ్ళి చూపులు’ సినిమా ఇన్స్ పైర్ చేసింది అని  ఇంద్రగంటి గారు  చెప్పినంత మాత్రాన అది నిజం కాదు.. ఆయన నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అని ఉంటాడు… అంతకు మించి ఏం లేదు…

‘అమ్మ’ కూడా ఒక రోల్ లో…

ఈ సినిమాలో అమ్మ కూడా ఓ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాతో పాటు  జయంత్ సి. పరాన్జీ సినిమాలో కూడా నటిస్తుంది.