తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ సినిమా

Monday,October 15,2018 - 03:34 by Z_CLU

రీసెంట్ గా తన ప్రొడక్షన్ హౌజ్ లోగోని లాంచ్ చేశాడు విజయ్ దేవరకొండ. ‘కింగ్ అఫ్ హిల్స్’ అనే పేరుతో లోగోని కూడా రిలీజ్ చేశాడు. అయితే త్వరలో నిర్మాతగా కొత్త సినిమాని సెట్స్ పైకి రానున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో హీరోని కూడా ఫిక్సయ్యాడు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తన కరియర్ ని మలుపు తిప్పిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు.

మ్యాగ్జిమం డిసెంబర్ లో ఈ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయనున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో మహానటి సినిమాలో సింగీతం శ్రీనివాస్ లా కనిపించిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

షమ్మీర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.