తరుణ్ భాస్కర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
Wednesday,July 04,2018 - 05:45 by Z_CLU
‘పెళ్ళి చూపులు’ సినిమా తరవాత అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టు స్టార్ హీరోతో సినిమా చేయకుండా, కొత్త వాళ్ళతో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. సినిమా సక్సెస్ కథే రీజన్ అని బలంగా నమ్మే తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా గురించి ‘జీ సినిమాలు‘ తో చాలా విషయాలు ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకున్నాడు…
అది నా ఫీలింగ్…
ఈ మధ్య సినిమా అనగానే జస్ట్ కమర్షియల్ ఆంగిల్ లోనే చూస్తున్నారు. కానీ కథను కథలా చూస్తేనే బెటర్ అని నా ఫీలింగ్… ఈ స్టార్ తో సినిమా చేస్తే, ఇన్ని కలెక్షన్స్ ఉంటాయి.. అనే యాంగిల్ లో ఆలోచిస్తున్నాం తప్ప.. కథను పట్టించుకోవట్లేదు.
బియాండ్ తెలుగు సినిమా…
జస్ట్ కమర్షియల్ ఆంగిల్ లోనే కాకుండా బియాండ్ తెలుగు సినిమా ఆలోచించాలి. వేరే లాంగ్వేజెస్ లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో…. అలాంటి స్టోరీ బేస్డ్ సినిమాలు ఇక్కడ కూడా చేయాలి.
అందుకే ఈ సినిమా…
హిందీ లో ‘దిల్ చాహతా హై’, ‘హ్యాంగోవర్’, ‘జిందగీ నా మిలేగీ దోబారా’ లాంటి సినిమాలు తెలుగులో కూడా ఉండాలి అనుకున్నా… నా ఫ్రెండ్స్ గురించి నాకు తెలిసిన విషయాలు.. మేము ఎంజాయ్ చేసిన డేస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ స్టోరీ పిక్ చేసుకున్నా.
స్టార్ ఇమేజ్ కి సూట్ అవ్వదు…
‘పెళ్ళి చూపులు’ సినిమా తరవాత పేపర్ పై పెన్ను పెట్టగానే తట్టిన కథ ఇది. ఈ స్టోరీకి ఏ స్టార్ ఇమేజ్ మ్యాచ్ అవ్వదు. రియలిస్టిక్ సిచ్యువేషన్స్ ఉన్న స్టోరీ కాబట్టి ఫ్రెష్ ఫేసెస్ అయితేనే బెస్ట్ అనుకుని కొత్తవాళ్ళను ప్రిఫర్ చేశాను.
చిన్న విషయం కాదు.
‘పెళ్ళి చూపులు’ సినిమా తరవాత మహేష్ బాబు గారు పిలిచి అప్రీషియేట్ చేశారు. ఆయనైతే నా ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకోకుండా మంచి క్యారెక్టర్ తో కథ రాయండి చేసేద్దాము అన్నారు… అంత పెద్ద స్టార్ తో సినిమా అంటే ఈజీ కాదు.. టైమ్ తీసుకుని పక్కా ప్లానింగ్ తో చేయాలి.
45 రోజుల్లో
సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ అయ్యాక చాలా తక్కువ టైంలో షూట్ చేయాలనీ డిసైడ్ అయ్యాను. అందుకే కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేసాము. మా టెక్నీకల్ టీం అందరూ బెస్ట్ సపోర్ట్ అందించారు.
సినిమా అనేది ఉద్యోగం కాదు…
సినిమా అనేది రెగ్యులర్ జాబ్ కాదు. గొడ్డు చాకిరీ లాగా సినిమాలు చేసేస్తా అంటే కుదరదు.. సినిమా అంటే లైఫ్ ఉండాలి.. దానికి తగ్గ అనుభవం నాక్కూడా రావాలి.. అప్పుడే కథలో లైఫ్ ఉంటుంది.
అన్నీ కాదు…
క్యారెక్టర్ నేమ్స్, షార్ట్ ఫిల్మ్ ఈవెంట్స్ తో పాటు గోవా ట్రిప్ నా రియల్ లైఫ్ లోంచి పిక్ చేసుకున్నవే కానీ.. గోవాలో జరిగినవన్నీ కంప్లీట్ గా ఫిక్షన్.
న్యూ జనరేషన్ మూవీ…
సినిమా రిలీజ్ తరవాత అక్కడక్కడా ‘స్టోరీ లేదు… ఎమోషన్ మిస్సయింది…’ లాంటి రియాక్షన్స్ ఎక్స్ పెక్ట్ చేసినవే.. సురేష్ బాబు గారు బిగినింగ్ లోనే చెప్పారు… ఇది కంప్లీట్ గా న్యూ జెనెరేషన్ మూవీ… అర్థమైన వాళ్ళకే అర్థమవుతుందని.
సినిమా చూడటం బాధ్యత…
ఒక సినిమా చూసి దాని గురించి డిస్కస్ చేయడం అనేది బాధ్యత. వరల్డ్ సినిమా స్టాండర్డ్స్ తెలిసిన వాళ్ళు జెన్యూన్ గా సినిమా గురించి మాట్లాడవచ్చు కానీ.. సినిమా టేకింగ్ దగ్గర నుండి లైట్స్ వరకు మాట్లాడటం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్.
ఫ్యాన్ మూమెంట్…
రాజ్ కుమార్ హిరానీని కలిసి నేను కూడా ఇలా సినిమా చేస్తున్నాను సర్ చెప్పుకున్నాను… సింక్ సౌండ్ లో చేస్తే చాలా టైమ్ సేవ్ అవుతుంది అని ఆయన కూడా చెప్పారు… కాసేపు టెక్నాలజీ గురించి మాట్లాడి ఫోటో దిగి వచ్చేశా.
చాలామంది మాట్లాడారు….
ఈ సినిమా రిలీజ్ తరవాత లగడపాటి శ్రీధర్ గారు, ఇంద్రగంటి గారు, యాక్టర్ కృష్ణుడు ఇలా చాలా మంది ఫోన్ చేసి అప్రీషియేట్ చేశారు.. వెంకటేష్ గారు.. రానా ఇంకా సినిమా చూడలేదు… నాగచైతన్య, NTR, త్రివిక్రమ్ గారు చూడాల్సి ఉంది. వాళ్ళకోసం స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్నాం.