టార్గెట్ ఫిబ్రవరి

Tuesday,February 07,2017 - 07:08 by Z_CLU

టీజర్ రిలీజయిందో లేదో ఎక్కడ చూసినా రాయుడి సీజన్ రాజుకుందనిపిస్తుంది. మరో వైపు ఎన్నడూ లేని విధంగా హై ఎండ్ సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న మహేష్ బాబు-మురుగదాస్ సినిమా పెద్దగా విజిబుల్ సౌండ్ లేకున్నా, ఫ్యాన్స్ సర్కిల్ లో ఇంటర్నల్ గా మహేష్ మానియా రాజుకుంటుంది.

అటు స్టార్స్ షెడ్యూల్స్ ఎలా ఉన్నా, ఫ్యాన్స్ వేసుకున్న ఎస్టిమేషన్స్ ప్రకారం మహేష్ బాబు, కొరటాల శివతో ఫిబ్రవరిలో తన నెక్స్ట్ సినిమా సెట్స్ పై ఉండాలి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకైనా  త్రివిక్రమ్ యాక్షన్ కి డైలాగ్ చెప్పడం గ్యారంటీ అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. కానీ ఎస్టిమేషన్స్ నుండి రియాల్టీ లోకి వస్తే సిచ్యువేషన్స్ తారుమారవుతున్నాయి.

మహేష్ బాబు మెయిన్ టైన్ చేస్తున్న సైలెన్స్ బట్టి సినిమా ఎంతవరకు కంప్లీట్ అయిందో తేల్చుకోవడం కష్టంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు షెడ్యూల్స్ ప్రకారం ఇంకా రెండు పాటలు షూటింగ్ జరుపుకుంటే మ్యాగ్జిమం ప్యాకప్ చెప్పే చాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నీ కుదిరి ఫ్యాన్స్ ఎస్టిమేషన్స్  రైట్ అని ప్రూఫ్ అయితే పవర్ స్టార్ త్రివిక్రమ్ సినిమా ఫిబ్రవరి సెట్స్ పైకి వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి.