బాలీవుడ్ కి టాలీవుడ్ కి అదే తేడా - తాప్సీ

Monday,February 05,2018 - 01:42 by Z_CLU

కమర్షియల్ సినిమా అయితే పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లేకపోతే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు, ఇవి ప్రస్తుతం తాప్సీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్న ట్రాక్. బాలీవుడ్ లోను చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ, బాలీవుడ్ కి టాలీవుడ్ కి పెద్దగా తేడా ఉండదని, రెండు చోట్ల కంటెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో ఇంప్రెస్ చేసిన తాప్సీ, ప్రస్తుతం మరో తెలుగు సినిమాతో సెట్స్ పై ఉంది. ఈ సినిమా మరీ ఫీమేల్ సెంట్రిక్ కాకపోయినా, హీరోతో ఈక్వల్ గా పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని క్లారిటీ ఇచ్చింది తాప్సీ. బాలీవుడ్ తో కంపేర్ చేస్తే టాలీవుడ్ లో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చాలా తక్కువ అని చెప్తూనే,  సౌత్ ఇండియన్ సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని సర్టిఫికెట్ ఇచ్చేసింది.

 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందునా డిఫెరెంట్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న తాప్సీ, ప్రస్తుతం తక్కిన బాలీవుడ్ స్టార్స్ లా వెబ్ సిరీస్ చేసే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా జుడ్వా2 తో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన తాప్సీ, దిల్ జంగ్లీ, ముల్క్, మన్ మర్జియాన్ తో పాటు హాకీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ సూర్మా సినిమాలతో బిజీగా ఉంది.