కచ్చితంగా చూడాల్సిన సినిమా !

Monday,July 22,2019 - 04:42 by Z_CLU

అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ‘ఆమె’. ఇటివలే విడుదలైన ఈ సినిమా  మంచి ప్రయోగాత్మక సినిమాగా ప్రసంశలు అందుకుంటుంది. ఈ సందర్భంగా  తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్న త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మీడియాతో ముచ్చటించాడు.

తమ్మారెడ్డి భరద్వాజ(దర్శక-నిర్మాత) మాట్లాడుతూ  సినిమా అనుకున్నట్టు రిలీజ్ అయితే కొంత వరకూ రీచ్ అయ్యేది. దాదాపు అన్ని షోలు బుక్ అవుతున్న సమయంలో తొలి రోజే ఐదు షోలు క్యాన్సల్ అవ్వడం సినిమాకు ఎఫెక్ట్ అయింది. టికెట్స్ బుక్ చేసుకొని వెనక్కి వెళ్ళిన ఆడియన్స్ మళ్ళీ సినిమా చూడటానికి ఆసక్తి కనబరచలేదు. లేదంటే తెలుగులో ఓ మంచి డబ్బింగ్ సినిమా అయ్యి ఉండేది.


ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే… ఒక మంచి సినిమాను తీసుకోవడమే కాదు దాన్ని ప్రాపర్ గా రిలీజ్ చేయగలగాలి. ప్రాపర్ నిర్మాతలు దొరకాలిసీనియర్ అయి ఉండి నేనే నష్టపోయానంటే కొత్తవారు చాలా జాగ్రత్త పడాలి. ఏదైనా డబ్బింగ్ సినిమా తీసుకునే టప్పుడు, ప్రొడక్షన్ హౌజ్ గురించి ఆ నిర్మాతల గురించి తెలుసుకోవాలి. అప్పుడే రంగంలోకి దిగాలి. లేదంటే నాలాగే నష్టపోతారు. అదొక్కటే నేను చెప్పాలనుకున్నాను. అంతే తప్ప అందరికీ నా గురించి చెప్పాలన్న ఉద్దేశ్యం లేదు.

“సినిమా రిలీజ్ విషయంలో పెద్ద పొరపాటు జరిగింది. ఎవరితో సంబంధం లేకుండా నేను వద్దని చెప్పినా  వినకుండా నిర్మాతలు హడావుడిగా రిలీజ్ డేట్ వేసేసారు. పోనీయ్ రిలీజ్ అయినా ప్రాపర్ గా చేసి ఉంటే బాగుండేది. తమిళ్ నిర్మాతలు చివర్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం వల్లే అక్కడ, ఇక్కడ మొదటి రోజు  షోలు క్యాన్సల్ అయ్యాయి. సిన్సియర్ గా చేసిన ఎఫర్ట్ వృదా అవుతుందనే ఉద్దేశ్యంతో చివరికి అమలా పాల్ తన రెమ్యునరేషన్ వదులుకొని ఎదురు డబ్బు కట్టి మరీ సినిమాను రిలీజ్ చేసింది. ఆమె కి నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి.”

“ఓవరాల్ గా మంచి రిపోర్ట్ వచ్చింది. రివ్యూస్ బాగా రాసారు. కానీ రెవెన్యూ దగ్గరికొచ్చే సరికి వీక్ గా ఉంది. సినిమా కచ్చితంగా అందరూ చూడాలి ఎందుకంటే కాన్సెప్ట్ , అమలా పాల్ పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. నాదీ గ్యారెంటీ. సెకండ్ హాఫ్ లో కాస్త లెంగ్త్ ఎక్కువైంది. అదొక్కటే కంప్లేంట్ అది తప్ప సినిమాలో ఇంకేం మైనస్ లేం లేవు. ” అని తెలిపారు.