తమన్నా – గ్లామరస్ దెయ్యం

Friday,June 21,2019 - 11:02 by Z_CLU

తమన్నా వల్ల సినిమాల్లో దెయ్యాల లుక్ మారిపోయింది. ఇప్పటి వరకు ఎంత మాడరన్ ఆన్ స్క్రీన్ దెయ్యాలైనా గ్లామర్ గా కనిపించడానికి వీల్లేదు అనే స్ట్రిక్ట్ రూల్ ఉండేది. ఏదైనా ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ఉంటే తప్పా సినిమా మొత్తం ఒకే రకం కాస్ట్యూమ్స్ లో కనిపించాల్సిందే. కానీ ఆ దెయ్యం రోల్స్ కాస్త మిల్కీ బ్యూటీ వచ్చేసరికి గ్లామర్ అద్దుకున్నాయి… రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి.

‘అభినేత్రి’ సిరీస్ చూస్తే దెయ్యాలు కూడా ఇంత గ్లామరస్ గా ఉంటాయా..? అనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే దెయ్యాలను గ్లామర్ కి దూరంగా ఉంచాల్సిన స్టీరియో టైప్ ని బ్రేక్ చేసిందీ తమన్నా.

ఇప్పుడు ‘రాజుగారి గది 3’ లో కూడా తమన్నా కనబడబోయేది దెయ్యం గానే.. కాకపోతే గ్లామరస్ దెయ్యం. ‘రాజుగారి గది 2’ లో సమంతా నటించినా, అది గ్లామరస్ రోల్ కాదు. మ్యాగ్జిమం సినిమా సస్పెన్స్ పైనే రన్ అవుతుంది. కానీ దర్శకుడు ఓంకార్ ఈ సారి పెన్నుకు కాస్తంత గ్లామర్ ఆడ్ చేసి రాసుకున్నాడు.

రాజుగారి గది గత సీక్వేల్స్ కన్నా ఈసారి కథ మరింత అప్డేట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా తమన్నా క్యారెక్టర్ సినిమాలో స్పెషల్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటున్నారు మేకర్స్.