మహేష్ సినిమాలో తమిళ్ హీరో ?

Tuesday,December 13,2016 - 05:30 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాలో ఓ సప్రయిజ్ చోటు చేసుకుంది. ఈ సినిమాలో ఇప్పటికే తమిళ్ హీరో & డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో ఓ తమిళ్ హీరో జాయిన్ అయ్యాడు.

bharath

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో తమిళ్ హీరో భరత్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడట. ‘ప్రేమిస్తే’ సినిమాతో టాలీవుడ్ లో మంచి పాపు లారిటీ సంపాదించుకున్న ఈ కుర్ర హీరో కి ఓ కీ రోల్ ఆఫర్ చేశాడట మురుగుదాస్. తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కావడం..  పైగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమా అవ్వడంతో వెంటనే ఓకే చెప్పేసి షూట్ లో జాయిన్ అయ్యాడట భరత్. త్వరలోనే ఈ విషయాన్నీ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతుందట యూనిట్. అయితే హీరో భరత్ ది, మహేష్ బాబు మూవీలో నెగెటివ్ క్యారెక్టరా… పాజిటివ్ పాత్రా అనే విషయం తేలాల్సి ఉంది.