ర‌వితేజ‌ సినిమాలో త‌మిళ న‌టుడు !

Thursday,November 07,2019 - 01:49 by Z_CLU

‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ సినిమాల తర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ కాంబో సినిమాను నిర్మిస్తున్నారు. ర‌వితేజ 66వ సినిమాగా తెరకెక్కుతున్న ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు.

ద‌ర్శ‌క‌త్వం నుండి న‌ట‌న వైపు అడుగులేసి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో నటించనున్నాడు. ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రోసారి శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.