గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ

Thursday,January 31,2019 - 01:21 by Z_CLU

ఎఫ్2 సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకొచ్చిన తమన్న తెలుగులో మరో సినిమాకు సైన్ చేసింది. తిరు దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న సినిమాలో మిల్కీబ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు మరో 2 రోజుల్లో అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

ఈ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇండో-పాక్ బోర్డర్ లో ఉన్న జైసల్మేర్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడ కొనసాగుతుంది. అన్నీ కుదిరితే ఈ షెడ్యూల్ లోనే తమన్న జాయిన్ అవుతుంది.

గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.