‘దటీజ్ మహాలక్ష్మి’ టీజర్ రిలీజయింది

Friday,December 21,2018 - 04:51 by Z_CLU

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ‘దటీజ్ మహాలక్ష్మి’. అటు అల్ట్రా కమర్షియల్ సినిమాల్లో కలర్ ఫుల్ రోల్స్ లో కనిపిస్తూనే, మరోపక్క పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలతో ఆల్ రౌండర్  అనిపించుకుంటున్న తమన్నా, ఈ టీజర్ లో  పక్కా రాజమండ్రి అమ్మాయి  అనిపించుకుంటుంది.

ఉన్నపళంగా పెళ్ళి క్యాన్సిల్ అయి, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక్కతే హనీమూన్ అంటూ ప్యారిస్ కి వెళ్ళే ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ లా తమన్నా టీజర్ లో చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా రాజమండ్రిలో ఒక బ్రిడ్జి ఉంటాది, ఆ బ్రిడ్జిని ఇలా నిలబెడితే మీ ఈఫిల్ టవర్ బుడతలాగా అనిపిస్తది…’ అనే డైలాగ్, తమన్నా క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తుంది. ఓవరాల్ గా ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది ఈ టీజర్.

ఒక సాధారణ ఇన్నోసెంట్ అమ్మాయి పారిస్ ట్రిప్ లో ఏం తెలుసుకుంది..? అనేదే ఈ సినిమా స్టోరీలైన్. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ లో మ‌ను కుమ‌రన్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అమిత్ త్రివేది  మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.