రేపే తమన్నా ‘దటీజ్ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,October 18,2018 - 11:05 by Z_CLU

యూరోప్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో తెరకెక్కింది తమన్నా ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా. హిందీ బ్లాక్ బస్టర్ క్వీన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అయితే దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్  ని రేపు రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ లో తమన్నా నటిస్తుంది. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ లో ఇంప్రెస్ చేసిన తమన్నా, ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో కనిపించనుంది.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మీడియంట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.