పని పూర్తిచేసిన మిల్కీ బ్యూటీ

Saturday,July 28,2018 - 10:02 by Z_CLU

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా’క్వీన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న  ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. యూరోప్ లో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. షూటింగ్ తో పాటు మరోవైపు ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ చేసిన ఫిల్మ్ మేకర్స్ , రేపటి నుండి ఫైల్ ఫ్లెజ్డ్ గా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టనున్నారు.

తెలుగు, తమిళ మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది ఈ సినిమా. తెలుగు వర్షన్ లో తమన్నా లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఇపటి వరకు గ్లామరస్ రోల్స్ లో ఇంప్రెస్ చేసిన తమన్నా, ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్స్ లో కనిపించనుంది.

బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీడియంట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.