‘సైరా’ నుండి తమన్నా ఫస్ట్ లుక్

Friday,December 21,2018 - 03:00 by Z_CLU

ఈ రోజు గ్రాండ్ గా 29 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటుంది తమన్నా.  ఈ సందర్భంగా ‘సైరా’ టీమ్ ఈ సినిమా  నుండి తమన్నా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ తో పాటు సినిమాలో తమన్నా క్యారెక్టర్ పేరు కూడా మెన్షన్ చేశారు మేకర్స్. తమన్నా ప్లే చేస్తున్న ఎగ్జాక్ట్ క్యారెక్టర్ గెస్ చేయడం కష్టమే కానీ, ‘లక్ష్మి’ అనే రోల్ లో మెస్మరైజ్ చేయనుంది తమన్నా ‘సైరా’ సినిమాలో.

ప్రస్తుతం సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ పై ఫోకస్ పెట్టిన మేకర్స్, తమన్నా కాంబినేషన్ లో ఇప్పటికే కీ సిచ్యువేషన్స్ ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది తమన్నా.

ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజర్.