తమిళంలో తమన్నా హవా

Friday,February 03,2017 - 01:06 by Z_CLU

క్షణం ఖాళీ లేదు తమన్నా టైం టేబుల్ లో. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉన్న మిల్కీబ్యూటీ 2017 క్యాలెండర్ మొత్తం తమిళ సినిమాలతో నిండి పోయింది. రీసెంట్ గా హిందీ బ్లాక్ బస్టర్ క్వీన్ సినిమా రీమేక్ తో పాటు, పెళ్ళి చూపులు సినిమా రీమేక్ కి సంతకం చేసిన తమన్నా, ప్రభుదేవాతో కూడా మరో సినిమాలో జత కట్టనుంది.

ఆల్ రెడీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉందంటే, రీసెంట్ గా మరో బడా వెంచర్ లో ఆఫర్ కొట్టేసింది తమన్నా. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న విక్రమ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది తమన్నా.

tamannah-next-movie

 

నిజానికి ఈ సినిమాలో మొదట్లో సాయి పల్లవిని అనుకున్నా, సినిమా సెట్స్ పైకి రావడానికి టైం పడుతుండటంతో, సాయి పల్లవి ఈ సినిమా నుండి తప్పుకుంది, ఆ ప్లేస్ లో తమన్నా రీప్లేస్ అయింది.