షార్ట్ కట్ లో దూసుకుపోతుంది..

Saturday,September 24,2016 - 06:11 by Z_CLU

ఓ వైపు  హీరోయిన్ గా నటిస్తూనే అప్పుడుడప్పుడు కొన్ని స్పెషల్  ఆఫర్స్ అందుకుంటూ ఐటెంసాంగ్స్ లో తళుక్కున మెరుస్తోంది మిల్కీ
బ్యూటీ తమన్నా.. ఇటీవలే ప్రభాస్ సరసన ‘బాహుబలి’ లో అలరించిన ఈ ముద్దుగుమ్మ  తాజాగా ‘అభినేత్రి’ అనే మరో భారీ సినిమాతో కనువిందు చేయడానికి రెడీ అవుతోంది. ఈ గ్యాప్ లో ఓ ఐటెంసాంగ్ కూడా చేసింది.

‘జాగ్వర్’ అనే సినిమా లో  ఐటెం సాంగ్ చేసింది తమన్న. మొన్నా మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ‘అల్లుడు శీను’ లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ భామ ‘జాగ్వర్’ లో కూడా ఓ స్పెషల్ సాంగ్ తో అలరించింది. కన్నడ తో పాటు తెలుగులోనూ విడుదల కానున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 6న థియేటర్లలోకి వస్తుంది. తాజాగా షూట్ చేసిన ఐటెంసాంగ్ తో జాగ్వార్ షూటింగ్ కంప్లీట్ అయింది. తమన్నా చిందేసిన ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.