F3 మూవీలో బిగ్ సర్ప్రయిజ్

Wednesday,May 11,2022 - 05:21 by Z_CLU

Tamannaah’s Big Surprise And Turning Point In ‘F3’

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన  F3 మే 27న రిలీజవుతోంది. ఇటివలే రిలీజయిన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ అంచనాలు పెంచేసింది.  సినిమాలో ఓ బిగ్ సర్ప్రయిజ్ ప్లాన్ చేశాడు దర్శకుడు అనీల్.  సినిమాలో తమన్నా హారిక కేరెక్టర్ బిగ్ సర్ప్రయిజింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. కథను టర్న్ చేసే కీలక పాత్రలో తమన్నా కనిపించనుందని టీం చెప్తుంది. ”మన ఆశలే మన విలువలు” ఎఫ్3 లో తమన్నా హారిక పాత్ర చెప్పిన క్యాచి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్ లో కీలకంగా వుంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథలో బ్రిలియంట్ సర్ ప్రైజ్ రాబోతుంది. ఈ సర్ ప్రైజ్ సినిమాలో ఎక్స్ట్రార్డినరీగా వుండబోతుంది. తమన్నా కెరీర్ లోనే ఎఫ్ 3లో హారిక పాత్ర ది బెస్ట్ గా నిలవనుంది.మరి ఆ సర్ప్రయిజ్ ఏంటో అసలు తమన్నా కేరెక్టర్ కథకు ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుందో చూడాలి.

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన F2కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈసారి ఎంటర్టైన్ మెంట్ మోతాదు పెంచి ఈ సీక్వెల్ రెడీ చేసుకున్నాడు అనిల్.

 వెంకటేష్  సరసన తమన్నా , వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అనిపించుకొని చార్ట్ బస్టర్స్ లిస్టు లో చోటు సంపాదించుకున్నాయి. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మే 27న థియేటర్స్ లోకి రానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics