కాజల్ డ్రీం ప్రాజెక్ట్ లో తమన్నా ?

Tuesday,December 07,2021 - 05:47 by Z_CLU

కొందరు యాక్టర్స్ కి కొన్ని సినిమాలు డ్రీం ప్రాజెక్ట్ గా ఉంటాయి. హీరోయిన్ కాజల్ కి ‘ఇండియన్ 2’ అలాంటి సినిమానే అని చెప్పాలి. అవును ఒకేసారి ఇటు కమల్ హాసన్ తో అటు శంకర్ తో సినిమా చేసే అవకాశం అంటే ఎవరికైనా అది బిగ్ డ్రీం ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు కాజల్ ని అప్రోచ్ అవ్వగానే మిగతా సినిమాలు క్యాన్సల్ చేసుకొని మరీ డేట్స్ ఇచ్చేసింది కాజల్. షూటింగ్ లో కూడా పాల్గొంది. అంతా బాగానే ఉందనగా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. అక్కడి నుండి ఆ సినిమాకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.

షూటింగ్ జరుగుతుండగా అతి పెద్ద ప్రమాదం జరగడం, సినిమాకు పనిచేసిన వారికి గాయాలు అవ్వగా, ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడం లాంటివి జరిగాయి. ఆ సంఘటనతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత శంకర్ ఆ ప్రాజెక్ట్ వదిలేసి మిగతా సినిమాలు లైనప్ చేసుకున్నారు. రామ్ చరణ్ తో తెలుగు , తమిళ్ ప్రాజెక్ట్ తో పాటు హిందీలో రన్వీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ రీమేక్ కూడా ఎనౌన్స్ చేశాడు. దీంతో ‘ఇండియన్ 2’ నిర్మాత శంకర్ పై కోర్టులో కేసు వేశాడు. ఆ కేసులో నిర్మాతకు సానుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది.

అగ్రిమెంట్ ప్రకారం ‘ఇండియన్ 2’ సినిమాని శంకర్ కంప్లీట్ చేయాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో రామ్ చరణ్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ‘ఇండియన్ 2’ కి సంబంధించి మళ్ళీ షూట్ మొదలు పెట్టే పనిలో ఉన్నాడు శంకర్. ప్రస్తుతం హీరోయిన్ గా తీసుకున్న కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ప్లేస్ లో ఇప్పుడు తమన్నాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట శంకర్ అండ్ టీం. ఇదే నిజమైతే తమన్నా బంపర్ ఆఫర్ అందుకున్నట్టే.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics