త్రిష ఆఫర్ తమన్న చేతికొచ్చింది...

Tuesday,November 29,2016 - 09:05 by Z_CLU

మిల్కీబ్యూటీ తమన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు దక్కించుకుంది. హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమా సౌత్ రీమేక్ లో నటించేందుకు తమన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం దీన్నొక హిట్ సినిమా రీమేక్ గా మాత్రమే చూడొద్దు. ఈ రీమేక్ వెనక ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రముఖ నటి రేవతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుంది. ఇదొక స్పెషల్ ఎట్రాక్షన్ అనుకుంటే… మరో ప్రముఖ నటి సుహాసిని ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేయబోతోంది. ఇలా ఇద్దరు సీనియర్లతో కలిసి తమన్న పనిచేయబోతోంది.

మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ సినిమా కోసం మొదట త్రిషను అనుకున్నారు. త్రిష హీరోయిన్ గా క్వీన్ రీమేక్ ఆల్ మోస్ట్ కన్ ఫం అయిపోయింది. అయితే ఆఖరి నిమిషంలో త్రిష స్థానంలోకి తమన్న వచ్చి చేరింది. ఈ మార్పు ఎందుకు జరిగిందనే విషయాన్ని పక్కనపెడితే… ఒకేసారి తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఈ సినిమా రానుందనేది మరో హాట్ న్యూస్. సో… తన కెరీర్ లో మరో త్రిభాషా చిత్రంలో తమన్న నటించబోతోందన్నమాట.