తమన్నా లాబీయింగ్..?

Saturday,October 22,2016 - 12:02 by Z_CLU

అభినేత్రి తరవాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా విశాల్ తో ‘ఒక్కడున్నాడు’ షూటింగ్ లో బిజీగా ఉంది. వరస బడా బడా ప్రాజెక్ట్ లు చేస్తున్న ఈ బ్యూటీ… బాహుబలితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పావులు కదుపుతుంది. బాహుబలిలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించిన తమన్నా, బాహుబలి-2లోనూ నటిస్తుంది. ఇదే కాకుండా… బాహుబలికి పేకప్ చెప్పిన తర్వాత కూడా ప్రభాస్ తోనే మరోసారి నటించేందుకు మిల్కీబ్యూటీ ప్రయత్నిస్తోందట.

     బాహుబలి-2 కంప్లీట్ అయిన తర్వాత… సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. కుదిరితే ఈ సినిమాలో కూడా ప్రభాస్ సరసన నటించేందుకు తమన్న ప్రయత్నిస్తోందట. అయితే వరుసగా తమన్నాతోనే నటిస్తున్న ప్రభాస్… మరోసారి మిల్కీబ్యూటీకి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.