సెట్స్ పైకొచ్చిన తమన్న.. మహేష్ తో డాన్స్

Monday,December 09,2019 - 03:41 by Z_CLU

సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్న కూడా ఉందనే విషయం చాలామందికి తెలిసిందే. ఈ సినిమాలో తను స్పెషల్ సాంగ్ చేయబోతున్నాననే విషయాన్ని స్వయంగా మిల్కీబ్యూటీ ఆమధ్య ప్రకటించింది. ఇప్పుడా సాంగ్ షూట్ మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ నంబర్ లో మహేష్-తమన్న డాన్స్ చేస్తున్నారు.

ఎఫ్-2తో తమన్న-అనీల్ రావిపూడి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ చనువుతోనే అనీల్ రావిపూడి కోరిన వెంటనే ఒప్పుకున్నానని, పైగా ఇది మహేష్ మూవీ కూడా కావడంతో కాదనలేకపోయానంటోంది తమన్న. గతంలో మహేష్-తమన్న కాంబోలో ఆగడు సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్న, సరిలేరులో ఐటెంసాంగ్ చేస్తోంది.

ఈ సాంగ్ షూట్ తో సరిలేరు నీకెవ్వరు టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది సరిలేరు నీకెవ్వరు మూవీ.