పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకే అప్పగించింది

Saturday,February 09,2019 - 01:29 by Z_CLU

మొన్నటికి మొన్న కాజల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఒకవేళ పెళ్లి చేసుకోవాలనిపిస్తే అదంతా తన తల్లిదండ్రులు చూసుకుంటారని చెప్పింది. సేమ్ టు సేమ్ ఇదే స్టేట్ మెంట్ ను తమన్న కూడా రిపీట్ చేసింది.

మిల్కీబ్యూటీ కూడా తన పెళ్లి బాధ్యతను పేరెంట్స్ కే అప్పగించిందట. ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన తమన్న, ప్రస్తుతానికి తన మైండ్ లో డేటింగ్ లాంటి ఆలోచనలు లేవని, డైరక్ట్ గా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని అంటోంది తమన్న

దటీజ్ మహాలక్ష్మి మూవీని రిలీజ్ కు రెడీ చేసిన తమన్న, ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది. మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.