

Friday,July 22,2016 - 04:22 by Z_CLU
జనతా గ్యారేజీలోకి ఇప్పుడు సమంత, నిత్యామీనన్ తో పాటు తమన్నా కూడా ఎంటరైంది. ఇప్పటికే సినిమాలో స్టార్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఏ క్యారెక్టర్ లో చూసినా స్టార్లే కనిపిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు తమన్న కూడా తోడవ్వడంతో… సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. జనతా గ్యారేజ్ సినిమాలో తమన్న ఐటంసాంగ్ ఉంది. నిజంగా ఇది యంగ్ టైగర్ అభిమానులకు పండగ లాంటి వార్తే. గతంలో ఎన్టీఆర్-తమన్న కలిసి ఊసరవెల్లి అనే సినిమా చేశారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో తారక్ సరసన ఐటెంసాంగ్ లో ఆడిపాడబోతోంది తమన్న. సినిమాలో క్లైమాక్స్ కు ముందు తమన్న-తారక్ మధ్య అదిరిపోయే ఐటెంసాంగ్ వస్తుందట. ఓ ఐటెంసాంగ్.. ఆ వెంటనే భారీ క్లయిమాక్స్ ఇలా జనతా గ్యారేజ్ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ లా తయారవుతోందట. ఐటెంసాంగ్స్ కంపోజ్ చేయడంలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్… జనతా గ్యారేజ్ కోసం కూడా ప్రీ-క్లయిమాక్స్ కోసం అదిరిపోయే ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడట. తమన్న రాకతో జనతా గ్యారేజ్ పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలకానుంది.