Varun Tej Ghani - స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్

Monday,July 26,2021 - 05:51 by Z_CLU

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గని’ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ బయటకొచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ ని ఓ స్టార్ హీరోయిన్ తో చేయించి సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇటివలే కొందరు హీరోయిన్స్ ని అనుకోని ఫైనల్ గా తమన్నా తో ఆ సాంగ్ షూట్ చేయాలని ఫిక్సయ్యారట.

తాజాగా తమన్నా ని సంప్రదించి ఆమెను స్పెషల్ సాంగ్ కోసం ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. వచ్చే నెలలో హైదరాబాద్ లో ఈ సాంగ్ ని షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ కోసం స్టూడియో లో ఓ భారీ సెట్ వేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే తమన్నా కోసం తమన్ ఓ అదిరిపోయే మాస్ నంబర్ కంపోజ్ చేసి రికార్డింగ్ కూడా చేసిచ్చేసాడట. తమన్నా ‘F2’ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కాకపోతే అందులో వెంకీ సరసన హీరోయిన్ గా కనిపించిన మిల్క్ బ్యూటీ ఇప్పుడు వరున్ తో కలిసి హాట్ స్టెప్స్ వేయనుంది.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ , సిద్దు ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యుల్ లో మిగిలిన సన్నివేశాలు తీస్తున్నారు. అలాగే తమన్నా మీద తీయబోయే సాంగ్ తో టోటల్ షూట్ కి గుమ్మడి కాయ కొట్టెయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకొని నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics