మరో ఐటెంసాంగ్ కు ఓకే చెప్పిన మిల్కీబ్యూటీ

Wednesday,May 23,2018 - 11:53 by Z_CLU

తమన్నకు ఐటెంసాంగ్స్ కొత్తకాదు. ఇప్పుడీ బ్యూటీ మరో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది తమన్న. అది కూడా వెరీ వెరీ స్పెషల్ సాంగ్

గతంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ అల్లరి అల్లుడు సినిమాలోంచి ఓ పాటను సవ్యసాచి కోసం రీ-క్రియేట్ చేస్తున్నారు. అప్పట్లో ఈ పాటలో నాగ్-రమ్యకృష్ణ ఆడిపాడగా.. రీమిక్స్ లో చైతూ-తమన్న చిందేయనున్నారు. అప్పటి సాంగ్ కు, ఇప్పటి రీమిక్స్ కు ఒకడే సంగీత దర్శకుడు. అతడే ఎంఎం కీరవాణి.

గతంలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించింది తమన్న. హండ్రెడ్ పర్సెంట్ లవ్, తడాఖా లాంటి సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు చైతూ నటిస్తున్న సవ్యసాచి సినిమాలో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయింది.