రాజుగారి గదిలో మిల్కీబ్యూటీ

Saturday,March 09,2019 - 01:02 by Z_CLU

హారర్ సినిమాల్లో రాజుగారి గదిది ప్రత్యేకమైన స్థానం. మొదటి భాగం ఊహించని విధంగా హిట్ అయితే, రెండో భాగంలో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్ నటించడం విశేషం. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం వస్తోంది. అదే రాజుగారిగది-3. ఈసారి తమన్న పేరు గట్టిగా వినిపిస్తోంది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజుగారి గది-3లో మిల్కీబ్యూటీ కనిపించే ఛాన్స్ ఉంది. ఈ టైపు సినిమాల్లో నటించడం తమన్నకు కొత్తకాదు. గతంలో ఆమె అభినేత్రి లాంటి సినిమాల్లో ఈ తరహా పాత్రలు పోషించింది. ఇంకా చెప్పాలంటే అభినేత్రిలో ఆమె రెగ్యులర్ హారర్ సినిమాల కంటే కాస్త ఎక్కువగానే పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి రాజుగారిగది-3లో తమన్న ఎఁటరైతే సినిమా మరింత ఎంటర్ టైనింగ్ గా మారడం గ్యారెంటీ.

ఇటీవలే ముంబై వెళ్లి తమన్నా ని కలిసి కథ కూడా వినిపించి వచ్చాడట ఓంకార్. ప్రస్తుతానికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్ ఇదే. 3 భాషల్లో తమన్నా చేస్తున్న ఏదో ఒక సినిమా షూటింగ్ కొలిక్కి వస్తే తప్ప, రాజుగారిగది-3కి సంబంధించి అప్ డేట్ బయటకు రాదు.