శృతిహాసన్ to తమన్నా Via ఇలియానా

Thursday,July 02,2020 - 02:19 by Z_CLU

వకీల్ సాబ్ హీరోయిన్ ముచ్చట ఇది. ముందుగా శృతిహాసన్ అనుకున్నారు. తర్వాత ఇలియానా పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తగా లిస్ట్ లోకి తమన్న వచ్చి చేరింది. వరుసగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం

వకీల్ సాబ్ లో శృతిహాసన్ ఫిక్స్ అంటూ మేకర్స్ స్వయంగా ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో జరిగిన ఓ లైవ్ ఛాట్ లో వకీల్ సాబ్ లో తను నటించడం లేదంటూ శృతిహాసన్ చెప్పేసింది. అక్కడితో ఆ మేటర్ క్లోజ్ అయింది.

శృతిహాసన్ నో చెప్పిన వెంటనే తెరపైకి ఇలియానా పేరొచ్చింది. ఆమె పేరు ఇంకా జనాల్లోకి రిజిస్టర్ కూడా కాకుండానే, వకీల్ సాబ్ నుంచి ఇల్లీ బేబ్ అవుట్ అంటూ ప్రచారం జరిగింది. అలా గోవా బ్యూటీ కథ ముగిసింది.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి తమన్న పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈసారి మాత్రం ఫిక్స్ అంటున్నారు చాలామంది. అటు మేకర్స్ కూడా ఈ సస్పెన్స్ కు తెరదించుతూ హీరోయిన్ పేరు చెప్పేయాలని అనుకుంటున్నారు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తమన్న కనిపిస్తుందట.